కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వగానే ఆహ్వాన పత్రికను అందజేస్తాం: కాంగ్రెస్ నేత వేణుగోపాల్
- కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యత ప్రొటోకాల్ ఇంఛార్జ్ వేణుగోపాల్‌కు అప్పగింత
- హైదరాబాద్ వచ్చాక కేసీఆర్ అపాయింటుమెంట్ ఇస్తారన్న వ్యక్తిగత సిబ్బంది
- విపక్ష నేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ప్రొటోకాల్ ఇంఛార్జ్ వేణుగోపాల్‌కు అప్పగించింది. కేసీఆర్ అపాయింటుమెంట్ కోసం వేణుగోపాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసి ఇన్విటేషన్ ఇచ్చేందుకు వేణుగోపాల్ ప్రయత్నించారు. అయితే హైదరాబాద్ వచ్చాక అపాయింటుమెంట్ ఇస్తారని కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.
కాగా, ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అపాయింటుమెంట్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ అపాయింటుమెంట్ ఇవ్వగానే ఆహ్వాన పత్రికను అందిస్తామని వేణుగోపాల్ తెలిపారు. విపక్ష నేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, రేపు సీఎం రేవంత్ రెడ్డి... గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించనున్నారు.