ఆసుపత్రుల్లోని క్యాంటీన్లకు బిల్లులు చెల్లించలేదంటూ హరీశ్ రావు ఆగ్రహం
- ఆసుపత్రుల్లోని క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించలేదని మండిపాటు
- ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోగులు, డాక్టర్లకు ఆహారం అందటం లేదన్న హరీశ్ రావు
- వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
తెలంగాణ ఆసుపత్రుల్లోని క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రోగులతో పాటు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది కూడా అవస్థలు పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోగులకు, డాక్టర్లకు ఆహారం అందటం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికా కథనాన్ని ఆయన తన ట్వీట్‌లో అటాచ్ చేశారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికా కథనాన్ని ఆయన తన ట్వీట్‌లో అటాచ్ చేశారు.