అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి!
- ప్రాక్టీస్‌కు సరైన సౌకర్యాలు లేకపోవడంతో అభ్యంతరం
- సగటు సౌకర్యాలు లేకపోవడంపై కోచ్ ద్రావిడ్ సైతం అసంతృప్తి
- ఐసీసీకి ఫిర్యాదు చేసిన టీమిండియా !
మరొక్క రోజులోనే (జూన్ 1 నుంచి) టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ టోర్నీ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్‌లకు వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. టీమిండియా బుధవారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అయితే ప్రాక్టీస్ చేసేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడం పట్ల భారత ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పిచ్‌ల నుంచి ఇతర సౌకర్యాల వరకు అన్నీ తాత్కాలికంగా సిద్ధం చేసినవేనని, అన్ని సౌకర్యాలు సగటుగా ఉండడం పట్ల భారత జట్టు ఆందోళన లేవనెత్తిందని ‘న్యూస్ 18’ కథనం పేర్కొంది. ఈ మేరకు భారత జట్టు వర్గాల నుంచి సమాచారం ఉందని, జట్టు శిక్షణ పొందుతున్న కాంటియాగ్ పార్క్‌లో ‘సగటు’ సౌకర్యాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అసంతృప్తిగా ఉన్నారని వివరించింది. ఇదే విషయంపై ఐసీసీని కూడా టీమిండియా సంప్రదించిందని కథనం వివరించింది.
కాగా కాంటియాగ్ పార్క్‌లోని ప్రాక్టీస్ సౌకర్యాలకు సంబంధించి ఇంతవరకు తమకు ఏ జట్టూ ఫిర్యాదు లేదా ఆందోళన వ్యక్తం చేయలేదని ఐసీసీ స్పష్టం చేసిందంటూ కథనం ప్రస్తావించింది. ఇదిలావుంచితే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌పై భారత క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో తీవ్ర నిరాకు గురైన అభిమానులు టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. భారత్ 2008లో తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత టైటిల్‌ను గెలవలేకపోయింది.