'వెపన్' కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంది: సత్యరాజ్
- ఫాంటసీ యాక్షన్ మూవీగా 'వెపన్'
- గుహన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా
- కీలకమైన పాత్రలో నటించిన కట్టప్ప
- జూన్ 7వ తేదీన సినిమా విడుదల
మిలియన్ స్టూడియో బ్యానర్ మీద గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు.
సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘పెన్, మైక్, మీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్. తాన్యా హోప్ ఆంగ్లో ఇండియన్. కానీ తెలుగులో చక్కగా మాట్లాడారు. నేను ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. 'బాహుబలి' సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్ మూవీ కూడా అలాంటి ఓ చిత్రమే. ఇది పెద్ద హిట్ కాబోతోంది. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక కొత్త ట్రెండ్ కాబోతోంది" అన్నారు.
"గుహన్ మంచి కథను రాసుకున్నారు. వసంత్ రవి జైలర్‌లో అద్భుతంగా నటించారు. యంగ్ టాలెంటెడ్ యాక్టర్లతో నటించడం ఆనందంగా ఉంటుంది. నిర్మాత మన్జూర్ ఈ మూవీకి ఎంతో ఖర్చు పెట్టారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. 'కల్కి' సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయి. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండి’ అని చెప్పారు.