కేసీఆర్ ఇది చూడు... ఈ పడిగాపుల పాపం నీదే!: కాంగ్రెస్ ఎదురుదాడి
- ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం రైతులు క్యూలో నిల్చున్న ఫొటోను ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’
- 11 నెలల క్రితం అదే ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం రైతుల పడిగాపుల ఫొటోను షేర్ చేసిన కాంగ్రెస్
- కేసీఆర్ తన పదేండ్ల పాపాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఈ పాపం మీదేనంటూ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారంటూ 11 నెలల క్రితం ఓ మీడియా సంస్థ ప్రచురించిన స్క్రీన్‌షాట్‌ను కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అధికారం చేతిలో ఉందని కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించి, అన్ని వ్యవస్థలను, మరీ ముఖ్యంగా మీడియాను మేనేజ్ చేసి పదేండ్లు జనం పడే బాధలను తొక్కిపెట్టారని ఆ ఫొటోకు రాసుకొచ్చింది. ఇప్పుడు ప్రజాపాలన రాగానే పదేండ్ల పనితనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపింది.
కట్టిన కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఎటుచూసినా తప్పులేనని, కేసీఆర్ పదేండ్ల పాపాన్ని తమపై రుద్దే దుర్మార్గానికి తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజులు మళ్లీ రావడం కాదు.. మీ రాక్షస పాలనకు రోజులు దగ్గరపడి మీ కారు మూలకు పడిందన్న విషయం మళ్లీ గుర్తు చేయాలా మీ గులాబీలకు.. అని ప్రశ్నించింది.
కాగా, గురువారం నాటి ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మొదటి పేజీలో ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం రైతులు క్యూలో నిల్చున్న ఫొటోను ప్రచురించింది. దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ ఇలా ఎక్స్‌లో 11 నెలల క్రితం అదే ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం రైతులు క్యూలో నిల్చున్న ఫొటోను షేర్ చేసి బీఆర్ఎస్‌పై విరుచుపడింది.