కల్కి సినిమాకు అంత బడ్జెట్ ఎందుకైందో బయటపెట్టిన ప్రభాస్
- వచ్చే నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘కల్కి 2898 ఏడీ’
- సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించామన్న ప్రభాస్
- సినిమాలోని పేర్లు కూడా అలానే ఉంటాయన్న దర్శకుడు నాగ్ అశ్విన్
- సినిమా చూశాక వేరే లోకం లోకి వెళ్లి వచ్చామన్న భావన కలుగుతుందన్న దర్శకుడు
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. సినిమా బడ్జెట్ ఎక్కువ కావడానికి గల కారణాన్ని ప్రభాస్ తాజాగా బయటపెట్టాడు. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించామని, అందుకనే బడ్జెట్ ఎక్కువైందని తెలిపాడు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కల్కి మూవీ గ్లోబల్ రేంజ్‌లో ఉంటుందని తెలిపాడు. దేశంలోనే గొప్ప నటీనటులను తీసుకున్నట్టు చెప్పాడు. తనను అందరూ పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తున్నారని, అయితే ఆ పిలుపు తనపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొన్నారు. అయితే, తనను అలా పిలవడాన్ని మాత్రం అభిమానులు ఇష్టపడతారని వివరించారు. అలా పిలవడం వాళ్లకు సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నాడు.
సినిమాతో మరో లోకంలోకి
దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూసిన తర్వాత మరో ప్రపంచంలోకి వెళ్లి వచ్చామన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుందని పేర్కొన్నాడు. అవతార్ సినిమా చూసిన తర్వాత తాను అలాగే ఫీల్ అయినట్టు చెప్పారు. సినిమాలోని పాత్రల పేర్లు కూడా అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే పెట్టినట్టు వివరించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్ సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.