రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
- సమీక్షలో పాల్గొన్న కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి, కోదండరాం
- ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిహ్నం తుదిరూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన అధికారిక చిహ్నంను రేవంత్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.