ఏపీలో బ్యాంకు ఖాతాల్లోనే ‘సామాజిక భద్రత’ పింఛన్లు
- ఏప్రిల్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ
- మే లో బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల జమ
- జూన్ లోనూ బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్లు జమ చేసేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
- దివ్యాంగులు, నడవలేని వారికి మాత్రం ఇంటి వద్దే పింఛన్ పంపిణీ
వృద్ధులకు అందిస్తున్న సామాజిక భద్రత పింఛన్లను ఈసారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుమునుపు ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ నిర్వహించింది. మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, దివ్యాంగులు, నడవలేని వారికి మాత్రం ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.