రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను... వాళ్లెవరో త్వరలో చెబుతా: జగపతిబాబు
- సోషల్ మీడియాలో జగపతిబాబు ఆసక్తికర పోస్టు
- రియల్ ఎస్టేట్ మోసాలకు తాను కూడా బాధితుడ్నయ్యానని వెల్లడి
- రెరా నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలని అభిమానులకు సూచన
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తాను రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోయానని వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలకు తాను కూడా బాధితుడ్నయ్యానని, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భూమి కొనేముందు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
ఇటీవల తాను ఒక రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాణిజ్య ప్రకటనలో నటించానని, కానీ తనను మోసం చేశారని జగపతి బాబు ఆరోపించారు. అయితే, తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది? అనే అంశాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ లో మోసాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల హెచ్చరించారని జగపతిబాబు గుర్తుచేశారు.