నితీశ్ కుమార్ జూన్ 4 తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకుంటారు: తేజస్వి యాదవ్

  • నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటారని జోస్యం
  • తన పార్టీని, రాజకీయాల్లో వెనుకబడిన తరగతులను కాపాడటం కోసం ఏదైనా చేస్తాడని వ్యాఖ్య
  • సార్వత్రిక ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఎన్డీయేలో చేరిన నితీశ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరోసారి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నితీశ్ కుమార్ జూన్ 4 తర్వాత తన పార్టీని, రాజకీయాల్లో వెనుకబడిన తరగతుల వారిని కాపాడటం కోసం ఏదైనా చేస్తాడని జోస్యం చెప్పారు. అందుకోసం ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడరని వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్ సీఎం పదవి కోసం ఐదుసార్లు కూటమిని మార్చారు. బీజేపీని కాదని ఇండియా కూటమిలో చేరిన ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీయే గూటికి చేరుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ... తాను పార్టీ మారడం ఇదే చివరిసారి అని, బీజేపీని వదిలేది లేదని స్పష్టం చేశారు.


More Telugu News