రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారు: వీహెచ్
- బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించాలని డిమాండ్
- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి పురోగతి లేదని విమర్శ
రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రాహుల్ గాంధీ వాటిని మారుస్తారని తెలిపారు.
నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను, మార్పులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు.
నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను, మార్పులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు.