నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్!
- తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం
- ఇవాళ ఒకే రోజు ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్
- అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు
- ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఊపీరి పీల్చుకున్న పోలీసులు
తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒకే రోజు ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు ఇలా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. మొదట ప్రజాభవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కానీ, ఎలాంటి బాంబు లేకపోవడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. దాంతో ఈ ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే తాజాగా నాంపల్లిలోని కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని, మరి కాసేపట్లో కూల్చేస్తామని ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కానీ, ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.