సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరం: పవన్ కల్యాణ్
- తెలుగుదనానికి సొబగులు అద్దినవారిలో ఎన్టీఆర్ ఒకరన్న పవన్
- ఎన్టీఆర్ సంస్కరణలు, పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని వ్యాఖ్య
- గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నానన్న జనసేనాని
ఇవాళ దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో స్పందించారు.
"తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దిన వారిలో ఎన్టీఆర్ ఒకరు... ఈ విషయాన్ని తెలుగువారు కించిత్ గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను.
అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన శైలి అజరామరం. రెవెన్యూ వ్యవస్థలో ఎన్టీఆర్ గారు తీసుకువచ్చిన సంస్కరణలు, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఆయన జయంతిని పురస్కరించుకుని నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన స్వర్గీయ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.