కాంబోడియాలో తెలుగు యువకుడి నరకయాతన..!
- అక్కడి వారు చిత్రహింసలు పెడుతున్నారంటూ యువకుడి వీడియో సందేశం
- కాపాడాలంటూ బాధితుడి కుటుంబీకుల మొర
- ఏజెన్సీ మోసం కారణంగా కాంబోడియాలో చిక్కుకున్న తెలంగాణ యువకుడు
- బాధితుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంథంపల్లికి చెందిన ప్రకాశ్
ఓ ఏజెన్సీ చేసిన మోసం కారణంగా కాంబోడియాలో ఓ తెలుగు యువకుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. అక్కడి వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ సదరు యువకుడు కుటుంబ సభ్యులకు ఇటీవల ఓ వీడియో సందేశం పంపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ వీడియో చూసిన కుటుంబీకులు తమ బిడ్డను కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంథంపల్లికి చెందిన ప్రకాశ్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో అతనికి ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయం ఒకరోజు ఇంట్లోవారికి ఫోన్ ద్వారా చెప్పాడు. ఆ ఏజెన్సీ ద్వారా తాను ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు ప్రకాశ్ ఇంట్లో తెలిపాడు.
కానీ, సదరు ఏజెన్సీ అతడిని ఆస్ట్రేలియాకు కాకుండా కాంబోడియా తీసుకెళ్లింది. ఇక అక్కడి వారు తరచూ తనపై దాడి చేస్తున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ప్రకాశ్ తాజాగా తన కుటుంబ సభ్యులకు వీడియో పంపించాడు. ఎలాగైనా తనను అక్కడి నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలని కోరాడు. ఈ వీడియో చూసిన కుటుంబ సభ్యులు తమ బిడ్డను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు.