ప్రముఖ సినీనటుడు చిరంజీవికి గోల్డెన్ వీసా

  • మెగాస్టార్‌కు గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ
  • అభిమానుల్లో ఆనందం, నెట్టింట వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తున్న యూఏఈ
ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను ఆయన అందుకున్నారు. ఇటీవల పద్మవిభూషణ్ గెలుచుకున్న చిరంజీవికి తాజాగా గోల్డెన్ వీసా దక్కడంతో అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. నెట్టింట ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ వీసాను అందిస్తోంది. గతంలో భారత చిత్రపరిశ్రమకు చెందిన షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులు గోల్డెన్ వీసా అందుకున్నారు. 

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ లో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథ, రూ. 200 కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. మూవీలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే త్రిష, ఆషికా రంగనాథ్‌ల పేర్లను చిత్రబృందం ప్రకటించింది. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News