తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశం
- రేపు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవవచ్చునని తెలిపిన వాతావరణ శాఖ
- రెమాల్ ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మంగళవారం నాడు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవవచ్చునని వెల్లడించింది.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రెమాల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.