బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకలు
- జూన్ 1వ తేదీ నుంచి 3 వరకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు
- గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ
- హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన ఉత్సవాలు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1వ తేదీ నుంచి 3 వరకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ ఒకటిన గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పిస్తారు.
రాష్ట్రం వచ్చి దశాబ్దికాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. అదేరోజున హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.