తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులను సూచించిన ముఖ్యమంత్రి
  • చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం వంటి రాచరిక ముద్రను తొలగించాలని సూచన
  • ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని భావిస్తున్న సీఎం
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులను సూచించారు. గతంలో చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే రాచరికపు ముద్రకు బదులు ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్ని... జూన్ 2న ఆవిష్కరించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దాదాపు 12 నమూనాలు రూపొందించగా... వాటిలోనే ఒక దానిని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు.


More Telugu News