గుంటూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
- ఏపీలో జూన్ 4న కౌంటింగ్
- ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశామన్న మీనా
- స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని వెల్లడి
- ప్రస్తుతం పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరణ
ఏపీలో కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
ఇవాళ గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను ముఖేశ్ కుమార్ మీనా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని... అభ్యర్థులు, ఏజెంట్లు రెండుసార్లు పరిశీలించే అవకాశం కల్పించామని వివరించారు.
అల్లర్ల దృష్ట్యా రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించామని, కౌంటింగ్ రోజు, ఆ తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని మీనా వివరించారు. ప్రస్తుతం పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.