మా నాన్న ఎంత సంపాదించాడంటే ఏం చెప్పను?: రంగనాథ్ తనయుడు నాగేంద్రకుమార్

  • ఉమ్మడి కుటుంబాన్ని పోషించిన రంగనాథ్
  • బరువు బాధ్యతలు ఆయనే మోశాడన్న తనయుడు  
  • అప్పట్లో ఆయనకి వచ్చింది తక్కువేనని వ్యాఖ్య
  • ఆయన సంపాదన ఎంతన్నది చెప్పలేదని వెల్లడి
రంగనాథ్ .. కొన్ని పాత్రలను ఆయన చేస్తేనే కరెక్టు అనిపించే పర్సనాలిటీ .. కంఠం ఆయన సొంతం. రంగనాథ్ ఒక సీన్లో ఉన్నారంటే .. గంభీరమైన ఆయన డైలాగ్ డెలివరీకి తట్టుకుని నిలబడటం కష్టం. అలాంటి ఆయన గురించి ఆయన తనయుడు నాగేంద్రకుమార్ ప్రస్తావించారు. "నాన్నగారు ఎంత సంపాదించారు .. అదంతా ఏమైపోయింది" అని అడిగితే చెప్పడం కష్టం" అన్నారు.

"అప్పట్లో మా ఇంట్లో 20 మందికి పైగా ఉండేవారం. ఆరోజుల్లో నాన్నకి ఒక సినిమాకి వచ్చే పారితోషికం కూడా తక్కువనే. అందులోనే ఇంతమందికి సర్దుబాటు చేయవలసి ఉంటుంది. అందరి చదువులు .. పెళ్లిళ్లు .. పురుళ్లు .. ఇలా అన్ని కార్యక్రమాలు నాన్నగారి చేతుల మీదుగానే జరిగాయి. ఉమ్మడి కుటుంబం కావడం వలన కూడబెట్టేంత మిగిలి ఉండకపోవచ్చు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"నాన్నగారు తాను ఇంత సంపాదిస్తున్నాననిగానీ .. ఈ సినిమాకి ఇంత తీసుకున్నాననిగాని ఎప్పుడూ మాకు చెప్పలేదు. చివరివరకూ కూడా ఆయన మాకు ఏమీ ఇవ్వలేదు .. మేము అడగలేదు. తన సంపాదనని ఎవరికైనా దానం చేశారా? ఎవరినైనా చదివించారా? అనేది మనకి తెలియదు. మేనేజర్ ను అడిగి తెలుసుకోవచ్చు .. కానీ మా నాన్న అలా మమ్మల్ని పెంచలేదు" అని అన్నారు.



More Telugu News