మా నాన్నగారికి ఆ దర్పం అలా వచ్చింది: రంగనాథ్ తనయుడు నాగేంద్రకుమార్
- ఆయన చాలా సింపుల్ గా వుండేవారన్న తనయుడు
- తమనీ అలాగే పెంచారని వివరణ
- ఆడంబరాలు ఆయనకి నచ్చవని వెల్లడి
రంగనాథ్ .. తెలుగు తెరపై గంభీరమైన రూపంతో .. వాయిస్ తో ఆకట్టుకున్న నటుడు. కథానాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన తనదైన ముద్రవేశారు. అలాంటి రంగనాథ్ గురించి ఆయన తనయుడు నాగేంద్రకుమార్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
"నేను పుట్టింది రాజమండ్రిలో .. పెరిగింది చెన్నైలో .. ప్రస్తుతం ఉంటున్నది బెంగుళూర్ లో. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న పర్సనాలిటీ .. ఆయన వాయిస్ చూసి నేను భయపడుతూ ఉండేవాడిని. ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు .. మమ్మల్ని కూడా అలాగే పెంచారు. ఆడంబరాలు .. అట్టహాసాలు ఉండేవి కాదు. ఇంట్లో ఉంటే ఆయన కవితలు రాస్తూ కూర్చునేవారు" అని అన్నారు.
"మా తాతగారు 'మందస మహారాజు' గారి దగ్గర ఆస్థాన వైద్యుడిగా ఉండేవారు. చిన్నప్పుడు ఆయనతో పాటు మా ఫాదర్ ఆ బంగ్లాకి తరచూ వెళ్లేవారు. ఆ జమీందారీ వ్యవస్థ .. అక్కడి పద్ధతులు .. వాతావరణం అంతా చాలా దగ్గరగా చూడటం వలన, అవి ఆయనను ప్రభావితం చేశాయి. అందువలన ఆయనలో ఆ దర్పం కనిపిస్తూ ఉంటుంది" అని చెప్పారు.