మహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ మాజీ మేయర్‌పై కాల్పులు

  • నాసిక్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో ఘటన
  • ఓల్డ్ ఆగ్రా రోడ్డులో ఓ షాపు వద్ద ఉన్న అబ్దుల్ మాలిక్‌పై గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు 
  • బాధితుడికి ఛాతి, కాలికి గాయాలు, ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
  • నిందితులపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు
మహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాలిక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. నాశిక్ జిల్లా లో ఓల్డ్ ఆగ్రా రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌కు సమీపంలోగల షాపు వద్ద మాజీ మేయర్ కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.20 గంటలకు  బైక్ పై వచ్చిన నిందితులు మాజీ మేయర్ పై మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. మాలిక్ ఛాతి, కాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని నిందితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News