బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన 'రెమాల్'
- ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెమాల్ తుపాను
- కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 230 కి.మీ దూరంలో కేంద్రీకృతం
- ఈ రాత్రికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'రెమాల్' తుపాను నేడు తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెమాల్ తీవ్ర తుపాను ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ తీవ్ర తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుంది. ఈ తుపాను ప్రభావంతో గరిష్ఠంగా 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది. దీని ప్రభావం ఏపీపై లేనప్పటికీ, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.