ఆర్వో సీల్ లేని పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టత ఇచ్చిన ఈసీ

  • ఆర్వో సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై అనిశ్చితి
  • ఆర్వో సీల్ లేకపోయినా... ఆర్వో సంతకం ఉంటే చెల్లుబాటు అవుతాయన్న ఈసీ
  • ఫారం-13ఏ లో అన్ని వివరాలు ఉండాలని స్పష్టీకరణ
  • ఈ మేరకు మార్గదర్శకాలు
రిటర్నింగ్ అధికారి సీల్ (ముద్ర) లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆర్వో సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఈసీ నిర్దేశించింది. ఆర్వో సీల్ లేకపోయినా... ఆర్వో సంతకం ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

అయితే, ఫారం-13ఏ లో అన్ని వివరాలతో పాటు ఆర్వో సంతకం కూడా ఉండాలి... అప్పుడే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఒకవేళ ఫారం-13ఏ లో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవచ్చు అని ఈసీ వివరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల రిటర్నింగ్ అధికారులకు పంపించారు.


More Telugu News