మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు దేశం నిర్ణయించింది: ప్రధాని మోదీ

  • సదుద్దేశాలు, విధానాల కారణంగా మూడోసారి ‘మోదీ సర్కార్’ రాబోతుందన్న ప్రధాని
  • ఇండియా కూటమి కుల, మతపరమైనదని వ్యాఖ్యానించిన మోదీ
  • ఉత్తరప్రదేశ్‌లో 7వ దశ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ప్రధానమంత్రి విమర్శలు
జూన్ 4న మరోసారి మోదీ సర్కారు కొలువుదీరడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇప్పటికే ముగిసిన ఆరు దశల ఎన్నికల పోలింగ్‌లో దేశం ఈ మేరకు నిర్ణయించిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ-ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సదుద్దేశాలు, విధానాల కారణంగా బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయాలని దేశం నిర్ణయించుకుందని ఆయన వ్యాఖ్యానించారు  ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 

ఇండియా కూటమి మతపరమైనదిగా, కులపరమైనదిగా దేశం అర్థం చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకుగానూ రాజ్యాంగాన్ని మార్చాలని వారు నిర్ణయించుకున్నారని మోదీ ఆరోపించారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటారని, అలాంటి ప్రధానులు దేశాన్ని బలోపేతం చేయగలరా అని ప్రధాని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఓటు బ్యాంకుకే పరిమితమయ్యారని, అయితే మోదీ మాత్రం దేశంలోని పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు అంకితం అయ్యారని పేర్కొన్నారు.


More Telugu News