బాలీవుడ్ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా భార్య నటాషా.. విడాకులు ఖాయమే!
- పాండ్యాతో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించిన నటాషా స్టాంకోవిక్
- విడాకులపై అడిగిన ప్రశ్నకు నవ్వేసి ‘థ్యాంక్యూ’ అనేసి వెళ్లిపోయిన నటాషా
- ఈ దెబ్బతో స్పష్టత వచ్చేసిందంటున్న నెటిజన్లు
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడిపోతున్నట్టు వస్తున్న వార్తలపై సెర్బియన్ డ్యాన్సర్, మోడల్ నటాషా స్టాంకోవిక్ ఎట్టకేలకు పెదవి విప్పారు. బాలీవుడ్ నటి దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడిన నటాషా.. పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి ‘థ్యాంక్యూ’ అని వెళ్లిపోయారు. విడాకుల వార్తలపై నటాషా ఇలా స్పందించడం ఇదే తొలిసారి. ఆమె నర్మగర్భ సమాధానంతో విడాకులపై క్లారిటీ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
పాండ్యా-నటాషా కరోనా లాక్‌డౌన్ సమయంలో మే 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల అగస్త్య పాండ్యా అనే కుమారుడు ఉన్నాడు. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా అనే పేరును తొలగించడాన్ని గుర్తించిన నెటిజన్లు వీరిద్దరూ విడిపోబోతున్నారని పోస్టులు పెట్టడంతో ఆ వార్త వైరల్ అయింది. గతంలో నటాషా ఇన్‌స్టాలో నటాషా స్టాంకోవిక్ పాండ్యా అని ఉండేది. ప్రస్తుతం నటాషా స్టాంకోవిక్‌గానే కనిపిస్తోంది.
మార్చి 4న ఆమె బర్త్ డే నాడు కూడా పాండ్యా ఎలాంటి విషెస్ చెప్పకపోవడం విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చింది. అలాగే నటాషా కూడా కుమారుడి ఫొటోలు తప్ప పాండ్యాతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించింది.
ఐపీఎల్‌లో పాండ్యా ముంబైకి సారథ్యం వహించాడు. ముంబై మ్యాచ్‌ల సమయంలోనూ నటాషా ఎక్కడా స్టాండ్స్‌లో కనిపించలేదు. ముంబైకి మద్దతుగా పోస్టులు కూడా పెట్టలేదు. మరోవైపు, అటు నటాషా కానీ, ఇటు పాండ్యా కానీ ఎక్కడా తమ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు.