కాలేజీ ప్రొఫెసర్ల ‘జంబ లకిడి పంబ’ వీడియో చూశారా?

  • మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు.. ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్ల ర్యాంప్ వాక్
  • ఢిల్లీలో ఓ కాలేజీ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో విచిత్ర వేషధారణ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే ఓ కాలేజీలో పలువురు ప్రొఫెసర్లు ‘జంబ లకిడి పంబ’ అవతారం ఎత్తారు! మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు, ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్లు కనిపించి కాసేపు హల్ చల్ చేశారు. హొయలు ఒలకబోస్తూ సరదాగా ర్యాంప్ వాక్ చేశారు. విద్యార్థులను నవ్వుల్లో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

ఢిల్లీ యూనివర్సిటీ అఫీలియేషన్ గల కమలా నెహ్రూ కాలేజీలో ఇటీవల కోర్సు ముగిసిన ఓ క్లాస్ విద్యార్థుల కోసం ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో తాము చదువుచెప్పిన విద్యార్థులకు వీడ్కోలు పలికేందుకు ప్రొఫెసర్లు వెరైటీ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. మనం ధరించే వస్ర్తధారణలో ఆడ, మగ అనే తేడా ఎందుకు ఉండాలనే ఇతివృత్తంతో ర్యాంప్ వాక్ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గిన నాలుగేళ్ల తర్వాత తిరిగి గతేడాది నుంచే ఢిల్లీలో ఫేర్ వెల్ పార్టీలు మొదలయ్యాయి.


అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా మండిపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఓ యూజర్ అయితే ఏకంగా షోలో పాల్గొన్న వారికి షరియా చట్టం ప్రకారం శిక్షలు అమలు చేయాలన్నాడు. దేశంలోకి ఈ వైరస్ పాకినట్లుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఒక రకమైన సైద్ధాంతిక తీవ్రవాదాన్ని అనుభూతి చెందుతున్నట్లు ఉందని విమర్శించాడు.


More Telugu News