హైదరాబాద్‌లో 16 కౌంటింగ్ కేంద్రాలు.. ఒక్కోదాంట్లో 14 టేబుళ్లు
- ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న హైదరాబాద్
- మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లకు శిక్షణ
- కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమన్న ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పూర్తి జాగ్రత్త చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలంటూ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిన్న మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలకు కౌంటింగ్ ప్రక్రియపై బంజారాహిల్స్‌లోని కుమ్రంభీం భవన్‌లో శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి హాల్‌లో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే పరిష్కరించేందుకు నిపుణులు అందుబాటులో ఉంటారని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు.