బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు
- ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
- హేమ సహా 86 మందికి నోటీసుల జారీ
- రేవ్ పార్టీ కేసులో హైదరాబాద్‌లో ఆరో నిందితుడి అరెస్ట్
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏ2 నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.