నడిరోడ్డుపై మద్యం తాగుతూ అడిగిన వారిపై బూతులు తిడుతూ చిందేసిన యువతీయువకుల ఆటకట్టించిన పోలీసులు
- నిన్న తెల్లవారుజామున నాగోలులో ఘటన
- నడిరోడ్డుపైనే మద్యం తాగుతూ, దమ్ముకొడుతూ కనిపించిన యువతి, యువకుడు
- ప్రశ్నించిన వారిపై బూతులు
- పోలీసులు వచ్చే సరికే పరార్
- అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
తెల్లవారుజామునే నడిరోడ్డుపై ఓ చేత్తో సిగరెట్ పట్టుకుని, మరో చేత్తో బీరు బాటిల్ పట్టుకుని తాగుతూ మార్నింగ్ వాకర్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా, అలా కూడదన్న వారిపై బూతులు తిడుతూ పైపైకి వచ్చిన యువతీయువకులు ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లోని నాగోలులో నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు వారు పోలీస్ స్టేషన్‌లో ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే? పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ (25), మరో యువతితో కారులో వచ్చి ఫతుల్లాగూడ ప్రాంతంలో నడిరోడ్డుపై మద్యం తాగుతూ కనిపించారు. మార్నింగ్‌వాక్‌కు వచ్చినవారు ఇది సరికాదని, బహిరంగంగా ఇది మంచిపద్ధతి కాదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారిద్దరూ తమను ప్రశ్నించిన వారిపై ఎదురు తిరిగారు. బీరు బాటిల్‌తోపాటు సిగరెట్ పట్టుకుని కనిపించిన యువతి.. ప్రశ్నించిన వారిపై మీదిమీదికి వస్తూ బూతులు అందుకుంది. మార్నింగ్ వాకర్స్‌కు మరింతమంది తోడు కావడంతో ఇద్దరూ తోకముడిచారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే వారిద్దరూ మద్యం మత్తులోనే కారు నడుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వీరిద్దరినీ గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.