బంగాళాఖాతంలో 'రెమాల్' తుపాను... వాళ్లకు వర్షాలు, మనకు ఎండలు!
- మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- ఇది మరింత బలపడి తుపానుగా, ఆపై తీవ్ర తుపానుగా మారే అవకాశం
- ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీనిని 'రెమాల్' అని పిలవనున్నారు.
కాగా, ఈ నెల 25వ తేదీ రాత్రికి తీవ్ర తుపానుగా బలపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 28 వరకు బెంగాల్ లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
అదే సమయంలో, ఏపీపై ఈ తుపాను ప్రభావం ఏమాత్రం ఉండదని, రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.