నర్సింగ్ విద్యార్థిని మృతి కేసు... నిందితుల తరఫున వచ్చారా? అంటూ ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థులు
- భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతి
- పారా మెడికల్ కాలేజీ వద్ద బంధువులు, విద్యార్థుల నిరసన
- కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
- ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విద్యార్థులు, కుటుంబ సభ్యుల నిరసన
- కారుణ్య బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే
భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కారుణ్య మృతి నేపథ్యంలో భద్రాచలం పారా మెడికల్ కాలేజీ వద్ద బంధువులు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు.
దీంతో కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. నిందితుల తరఫున ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కారుణ్య బంధువులకు నచ్చచెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. కానీ వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.
నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కాలేజీ ప్రాంగణంలో ఆమె గాయాలతో పడి ఉన్నారు. దీంతో యాజమాన్యం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. కారుణ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందింది. దీంతో ఈరోజు ఆమె బంధువులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చి కళాశాల వద్ద నిరసన తెలిపారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.