దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో హింస చోటుచేసుకున్నా అరెస్ట్ లేదు: కనకమేడల

  • ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1గా ఉన్న పిన్నెల్లి
  • పిన్నెల్లిపై జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దన్న ఏపీ హైకోర్టు
  • ఈసీ అరెస్ట్ చేయాలని చెప్పినా పోలీసులు జాప్యం చేశారన్న కనకమేడల
  • టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం చేసినా కేసు లేదని ఆరోపణ
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు నిన్న పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే.  

తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో హింస చోటుచేసుకున్నా అరెస్ట్ లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అరెస్ట్ చేయాలని ఆదేశించినా పోలీసులు ఆలస్యం చేశారని, హింసాత్మక ఘటనలకు సహకరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని కనకమేడల విమర్శించారు. 

టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం చేసినా కేసు లేదని ఆరోపించారు. సమస్యాత్మక ప్రాంతమైనా తగిన బందోబస్తు లేదని, జరిగిన పరిణామాలను చూస్తుంటే కౌంటింగ్ సమయంలో అయినా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అనే అనుమానం కలుగుతోందని కనకమేడల వ్యాఖ్యానించారు. 

పిన్నెల్లి అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, పిన్నెల్లిని అరెస్ట్ చేసి ఎన్నికల్లో పోటీ  చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


More Telugu News