ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ... కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ

  • మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
  • జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ వెల్లడి
  • ఈడీ కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈడీ లాయర్లు
  • జాబితాలోని కేసుల విచారణ తర్వాత తీసుకుంటామన్న జడ్జి
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కౌంటర్ దాఖలు చేయగా... సీబీఐ గడువు కోరింది. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

తాము మే 27న సీబీఐ కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. మరోవైపు, ఈడీ కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే జాబితాలోని కేసుల విచారణ తర్వాత తీసుకుంటామని జడ్జి తెలిపారు.

వాదనలు సోమవారానికి వాయిదా

ఈడీ కేసులో, కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్‌కు సంబంధించిన వివరాలు కవిత న్యాయవాదికి ఇవ్వాలని హైకోర్టు ఈడీని ఆదేశించింది. అనంతరం వాదనలను సోమవారానికి వాయిదా వేసింది.


More Telugu News