ఎవరెస్ట్ ఎక్కిన 16 ఏళ్ల భారత టీనేజర్.. నయా రికార్డు
- నేపాల్ వైపు నుంచి పర్వత శిఖరాన్ని చేరిన తొలి అతిపిన్న భారత వయస్కురాలిగా కామ్యా కార్తికేయన్
- ప్రపంచం మొత్తంమీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా ఖ్యాతి
- నౌకాదళంలో పనిచేసే తండ్రితో కలసి ఈ నెల 20న ఎవరెస్ట్ అధిరోహణ
- ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన ఇండియన్ నేవీ
ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అసాధారణ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను నేపాల్ వైపు నుంచి అధిరోహించిన తొలి భారత పిన్నవయస్కురాలిగా నిలిచింది. అలాగే ప్రపంచం మొత్తంమీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా ఖ్యాతిగాంచింది. భారత నౌకాదళంలో పనిచేసే తన తండ్రి ఎస్. కార్తికేయన్ తో కలసి కామ్యా ఈ నెల 20న 8849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ ను అధిరోహించింది. ఈ విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేసింది.
‘కామ్యా అసాధారణ ప్రతిభ ప్రదర్శించింది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన పర్వత శిఖరాలకుగాను ఆరింటిని అధిరోహించింది. అంటార్కిటికా ఖండంలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్ పర్వత శిఖరాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో అధిరోహించాలని భావిస్తోంది. తద్వారా ‘ఏడు ఖండాల్లో ఏడు శిఖరాల సవాల్’ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కురాలిగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాం’ అని ఇండియన్ నేవీ పోస్ట్ పెట్టింది.
కామ్యా కార్తికేయన్ ప్రస్తుతం ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. 2020 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా కామ్యా పేరు ప్రస్తావించారు. ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని కొనియాడారు. అలాగే 2021 జనవరిలో ఆమెతో వర్చువల్ గా మాట్లాడారు. రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నందుకు ఆమెను అభినందించారు.