టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. పసికూన యూఎస్ఏ చేతిలో సిరీస్ ఓటమి
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఓటమి
- నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో యూఎస్ఏ విజయం
- తొలి మ్యాచ్‌లోనూ దారుణంగా ఓడిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20లో బంగ్లాదేశ్‌కు పసికూన యూఎస్ఏ షాకిచ్చింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. నిన్న హూస్టన్‌లో జరిగిన రెండో టీ20లో ఏకంగా ఆరు వికెట్లతో బంగ్లాదేశ్ ఓడించి షాక్‌కు గురిచేసింది. యూఎస్ఏ నిర్దేశించిన 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 138 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది.
కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, షకీబల్ హసన్ 30, తౌహిద్ హృదయ్ 25, ఓపెనర్ తంజీద్ హసన్ 19 పరుగులు చేశాడు. మిగతా వారందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో అలీఖాన్ 3 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. సౌరభ్ నెట్వాల్కర్, షాడ్లీవన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కెప్టెన్ మోనక్ పటేల్ 42 పరుగులు చేయగా, స్టీవెన్ టేలర్ 31, అరోన్ జోన్స్ 35 పరుగులు చేశారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి బంగ్లాదేశ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కాగా, 21న జరిగిన తొలి మ్యాచ్‌లోనూ యూఎస్ఏ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి మ్యాచ్ 25న జరగనుంది.