పిన్నెల్లికి ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి
- పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు
- ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి
- పిన్నెల్లిని జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నేడు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో, పిన్నెల్లి స్పందించారు. న్యాయం గెలిచింది అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.