విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

  • మే 8న విజయవాడలో కూటమి రోడ్ షో
  • హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలో డ్రోన్ల కలకలం
  • ఒక డ్రోన్ ను నిర్వీర్యం చేసిన ఎస్పీజీ సిబ్బంది
  • ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనన్న కేంద్ర హోం శాఖ
ఈ నెల 8వ తేదీన విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ... ఎన్డీయే భాగస్వాములు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. దీన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. 

ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏపీ డీజీపీకి లేఖ పంపింది. ప్రధాని రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు, రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగురవేశారంటూ తన లేఖలో ఆరోపించింది. 

ప్రధాని రోడ్ షో చేపట్టిన బందరు రోడ్ ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోదీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి. రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఓ డ్రోన్ ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. 


More Telugu News