దేశంలోని అన్ని నగరాలు ఇండోర్‌లా మారాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
- ఇండోర్‌లోని రోడ్లు పరిశుభ్రంగా ఉండటాన్ని వీడియో తీసి పోస్ట్ చేసిన విదేశీయుడు
- అదే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- అన్ని నగరాలను ఇండోర్‌లా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విటర్) లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. తద్వారా ఆయన ఆలోచింపజేసే, స్ఫూర్తివంతమైన వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన మరో స్ఫూర్తిదాయకమైన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలను ఇండోర్‌లా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసలు విషయం ఏమిటంటే.. ఓ విదేశీయుడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని రోడ్లు పరిశుభ్రంగా ఉండటాన్ని వీడియో తీసి పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్తా ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. దీంతో వీడియోను ఆయన షేర్ చేశారు. ఇండోర్ నగర ప్రజల నిబద్ధతను అభినందించారు. ఇక ఇండోర్ వరుసగా ఏడో సంవత్సరం భారత్‌లో పరిశుభ్ర నగరంగా నిలిచిన విషయం తెలిసిందే.