ఆలయాల భూములపై మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన!
- ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేస్తామన్న మంత్రి
- భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని నిర్ణయం
- ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామన్న కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం నగరంలోని బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీసి, తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆధునిక పద్ధతుల్లో భూ రికార్డులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హస్మంత రావు, ఈఓలు, ఇతర కమిషనర్లు హాజరయ్యారు.