వైసీపీ అస్తవ్యస్త విధానాలతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసింది: దేవినేని ఉమా
- ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవడానికే ప్రభుత్వమన్నట్టు వ్యవహరించారన్న దేవినేని
- ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించుకున్నారని వ్యాఖ్య
- దోచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలన్న టీడీపీ నేత
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 'ఎక్స్' (ట్విటర్) వేదికగా మరోసారి ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనపై ఆయన దుమ్మెత్తిపోశారు. అస్తవ్యస్త విధానాలతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ భోగాల కోసం ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవడానికే ప్రభుత్వమన్నట్టు వ్యవహరించారన్నారు.
అస్మదీయులకు భూ కేటాయింపుల కోసమే క్యాబినెట్ భేటీలు తప్పితే, ప్రజా సంక్షేమం వారికి పట్టలేదని విమర్శించారు. సచివాలయం ఊసు మరిచి తాడేపల్లి ప్యాలెస్ నుండే ఆదేశాలు, నిర్ణయాలు వెలువడ్డాయని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని ఫైర్ అయ్యారు. పరిపాలన ఎలా చేయకూడదో చెప్పడానికి వైఎస్ జగన్ పాలనే ఒక ప్రామాణికమని దేవినేని ఉమా అన్నారు.