డాక్టర్ మ్యాక్స్ డౌ.. అమెరికాలో గౌరవ డాక్టరేట్ పొందిన పిల్లి!
- వెర్మాంట్ స్టేట్ యూనివర్సిటీ విచిత్ర నిర్ణయం
- క్యాంపస్ లో కలియతిరుగుతూ అందరితో స్నేహంగా మెలుగుతున్నందుకే..
- మ్యాక్స్ డౌతో ఫొటోలు దిగేందుకు పోటీ పడుతున్న విద్యార్థులు
సాధారణంగా గౌరవ డాక్టరేట్ ఎవరికి ఇస్తారు? సమాజానికి తమ వంతుగా కృషి చేసిన వారిని గౌరవ డాక్టరేట్ తో సత్కరిస్తుంటారు.
కానీ అమెరికాలోని వెర్మాంట్ స్టేట్ యూనివర్సిటీ క్యాసిల్టన్ క్యాంపస్ నిర్వాహకులు మాత్రం అనూహ్యంగా ఓ పిల్లికి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు! పోనీ అదేమైనా ఎలుకలను పట్టడంలో ప్రతిభ చూపిందా అంటే అదీ కాదట! క్యాంపస్ లోని విద్యార్థులతో అది నాలుగేళ్లుగా ఎంతో స్నేహంగా మెలుగుతోందట! అందుకే వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా దాన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారట! ఈ మేరకు మ్యాక్స్ డౌ అనే పిల్లి పేరిట గౌరవ డాక్టరేట్ ను వర్సిటీ పాలక మండలి సభ్యులు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేశారు.
వర్సిటీ క్యాంపస్ సమీపంలో నివసించే ఓ కుటుంబం మ్యాక్స్ ను పెంచుకుంటోంది. దానికి బోర్ కొట్టినప్పుడల్లా అలా సరదాగా క్యాంపస్ ను కలియతిరిగి వస్తుందని యజమాని ఆష్లే డౌ చెప్పాడు. దాన్ని చూసినప్పుడల్లా విద్యార్థులు ఎంతో ఉత్సాహపడుతుంటారని వివరించాడు. పిల్లితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు వారు పోటీపడుతుంటారని చెప్పాడు. ఒక్కోసారి కొందరు విద్యార్థులతో కలసి పిల్లి వెళ్లిపోతుంటుందని అన్నాడు. పిల్లితో బాగా అనుబంధం పెంచుకున్న విద్యార్థులు అది ఎప్పుడైనా కనిపించకపోతే పిల్లి ఎలా ఉందంటూ అడుగుతారని తెలిపాడు. డిగ్రీ పట్టాల ప్రదానం రోజున పిల్లి పేరుతో గౌరవ డాక్టరేట్ ను వర్సిటీ అధికారులు ఇంటికి పంపినట్లు చెప్పాడు.
అయితే జంతువులు గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఇదేం తొలిసారి కాదు. 2020లో మూస్ అనే ఎనిమిదేళ్ల కుక్క వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది. వేలాది మంది విద్యార్థులకు వెటర్నరీ వైద్యంలో తోడ్పాటు అందించినందుకు దాన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. అలాగే 2016లో డాక్టర్ టెడ్డీ అనే 16 ఏళ్ల గుర్రానికి సైతం గౌరవ డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా దానికి ఈ డాక్టరేట్ ప్రదానం చేసింది.