కిర్గిజ్‌స్థాన్‌లో మన విద్యార్థులపై హింస... ఓ విద్యార్థి నాకు ఫోన్ చేసి చెప్పాడు: అసదుద్దీన్
- ఐదు రోజులుగా ఏమీ తినలేదని తనతో ఓ విద్యార్థి చెప్పాడన్న అసదుద్దీన్
- భారత విద్యార్థుల రక్షణ కోసం కేంద్రమంత్రి జైశంకర్ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- పరిస్థితులు మెరుగుపడకుంటే మన విద్యార్థుల్ని రప్పించాలన్న హైదరాబాద్ ఎంపీ
కిర్గిజ్‌స్థాన్‌లో మన దేశానికి చెందిన విద్యార్థులపై కొంతమంది స్థానికులు హింసకు పాల్పడుతున్నారని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కిర్గిజ్‌స్థాన్‌లో ఉంటున్న ఓ విద్యార్థి తనకు ఫోన్ చేశాడని... ఐదు రోజులుగా ఏమీ తినలేదని తనతో చెప్పుకొని వాపోయాడని వెల్లడించారు.
మన విద్యార్థులపై అక్కడి వారు దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత విద్యార్థుల రక్షణ కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. కిర్గిజ్‌స్థాన్‌లో పరిస్థితులు మెరుగుపడకుంటే కనుక మన విద్యార్థులను ఇక్కడకు రప్పించాలని కోరారు.