బెంగాల్‌లో మమతాబెనర్జీ సోదరుడి ఓటు గల్లంతు
- హౌరా ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న బబున్ బెనర్జీ
- పోలింగ్ కేంద్రానికి వెళ్లాక... ఓటు గల్లంతైందని గుర్తించిన మమత సోదరుడు
- ఓటు గల్లంతుపై స్పందించేందుకు నిరాకరణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఓటు గల్లంతైంది. ఆయనకు హౌరా ప్రాంతంలో ఓటు హక్కు ఉంది. ఐదో విడతలో భాగంగా ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని భావించారు. కానీ అతని ఓటు గల్లంతైనట్లుగా తెలిసింది. ఓటు గల్లంతుపై ఆయనను మీడియా ప్రశ్నించగా... స్పందించేందుకు నిరాకరించారు.
ఈసీ పరిశీలిస్తోందన్న తృణమూల్ కాంగ్రెస్
ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని... ఏం జరిగిందనే అంశంపై ఈసీయే వివరణ ఇస్తుందని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక సమస్యను సృష్టిస్తారని, తనకు దురాశాపరులు అంటే ఇష్టముండదని సీఎం మమతాబెనర్జీ అన్నారు. తాను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించనని తేల్చి చెప్పారు.
మమత, బబున్ మధ్య విభేదాలు
హౌరా నుంచి తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ప్రసూన్ బెనర్జీకి టిక్కెట్ ఇవ్వడంపై బబున్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన టిక్కెట్ ఆశించినప్పటికీ నిరాశ ఎదురైంది. దీంతో మమత, బబున్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.