ముగిసిన లోక్ సభ ఐదో విడత పోలింగ్

  • వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్
  • సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదు
  • మిగిలి ఉన్న మరో రెండు విడతల పోలింగ్
సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. ఈ నెల 25వ తేదీన ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది.

జూన్ 4వ తేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం మొదటి నాలుగు విడతల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు ఉత్తరప్రదేశ్ (14), మహారాష్ట్ర (13), పశ్చిమ బెంగాల్ (7), బీహార్ (5), ఒడిశా (5), జార్ఖండ్ (3) రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్(1), లడఖ్(1)
లలోనూ పోలింగ్ పూర్తైంది.


More Telugu News