బెంగళూరు డ్రగ్స్ పార్టీ వ్యవహారం.. సినీ నటి హేమ అరెస్ట్?
- కలకలం రేపుతున్న బెంగళూరు రేవ్ పార్టీ
- హేమను అరెస్ట్ చేశారంటూ కన్నడ మీడియాలో వార్తలు
- ఈ సాయంత్రం పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇటు టాలీవుడ్ లో, అటు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రేవ్ పార్టీలో సినీ నటుడు శ్రీకాంత్, నటి హేమ ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాము బెంగళూరుకు వెళ్లనే లేదని, హైదరాబాద్ లోనే ఉన్నామని ఇద్దరూ వివరణ ఇచ్చారు. రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో తాను హైదరాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో ఉన్నానని హేమ వెల్లడించింది.
మరోవైపు, రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నదని, ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కన్నడ మీడియాలో వస్తున్నాయి. డ్రగ్స్ పార్టీ జరిగిన జీఆర్ ఫామ్ హౌస్ లోనే హేమ ఉందని చెపుతున్నారు. తాను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నానని హేమ ఈ ఉదయం ఒక వీడియో విడుదల చేసింది. అయితే, హేమ బెంగళూరులోని అదే ఫామ్ హౌస్ లో ఉందని... ఫామ్ హౌస్ లో ఓ పక్కకు వెళ్లి వీడియో రికార్డ్ చేసిందని తెలుస్తోంది. హేమతో పాటు, ఆమె స్నేహితుడు చిరంజీవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. హేమ ఫొటో దొరికిందని.. అదే డ్రెస్ లో హేమ విడుదల చేసిన వీడియో కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.
రేవ్ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. వీరిలో 70 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రేవ్ పార్టీ గురించి ఈ సాయంత్రంలోగా పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.