తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం... ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దన్న ఈసీ

  • కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ
  • జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్
  • రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కొనసాగుతోంది. నిన్నంతా ఈసీ అనుమతి కోసం వేచి చూసిన ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు... అనుమతి రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈసీ అనుమతి లభించడంతో ఈ మధ్యాహ్నం కేబినెట్ భేటీ అయింది.

అయితే ఈ భేటీకి ఈసీ కొన్ని షరతులు విధించింది. కేవలం జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... విద్యా సంస్థల్లో వసతులు, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ బ్యారేజ్ తదితర ప్రధాన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగుతోంది.



More Telugu News