ఎన్‌టీఆర్‌కు నారా లోకేశ్, రామ్ చ‌ర‌ణ్‌ బ‌ర్త్‌డే విషెస్

ఎన్‌టీఆర్‌కు నారా లోకేశ్, రామ్ చ‌ర‌ణ్‌ బ‌ర్త్‌డే విషెస్
  • నేడు జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ 41వ బ‌ర్త్‌డే
  • ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ తెలిపిన లోకేశ్
  • తార‌క్‌కు దేవుడు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్ర‌సాదించాలంటూ ట్వీట్‌
  • ఎన్‌టీఆర్‌కు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ ఏడాది దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నా' అంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు తార‌క్‌కు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట‌ర్) వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్టు పెట్టారు. ఇలాంటి సంతోష‌క‌ర‌మైన‌ పుట్టినరోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశారు.


More Telugu News