ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్
- ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్
- ఆగష్టు 2024 నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు ప్రకటన
- నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలిపిన మేకర్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు (సోమవారం) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తారక్ సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఆదివారం దేవర నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ విడుదల కాగా, ఇవాళ ఎన్టీఆర్ మరో మూవీ తాలూకు క్రేజీ అప్డేట్ వచ్చింది.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తారక్ ఇప్పటికే ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను గతేడాది ప్రకటించగా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే, ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయా అని తారక్ అభిమామలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తారక్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఆగష్టు 2024 నుంచి షూటింగ్ మొదలుకానున్నట్లు ప్రకటించారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్-2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తారక్ మూవీని సెట్స్‌పైకి తీసుకురానున్నాడు.
ఇక ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్టులుగా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే సలార్ కూడా రెండు పార్టులుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.