ఆర్సీబీ అసాధారణ విజయాల వెనక కోహ్లీ ‘ఒక శాతం సిద్ధాంతం’!
- నెట్టింట కోహ్లీ మాట్లాడిన పాత వీడియో వైరల్
- ఒక్కోసారి విజయానికి ఒక్క అవకాశమున్నా అదే సరిపోతుందని వ్యాఖ్య
- శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే ఒక శాతమే 10 శాతం, 30 శాతంగా మారుతుందని కామెంట్
- అలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం కూడా జరగొచ్చని వెల్లడి
ఆడిన తొలి 8 మ్యాచ్ లలో వరుసగా ఏడు ఓటములు.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం.. ఎందరు స్టార్లు ఉన్నా ఏం ఉపయోగం అంటూ కామెంటేటర్ల వ్యంగ్యాస్త్రాలు.. సరైన బౌలింగ్ లేకనే ఓటములన్న విమర్శలు.. సోషల్ మీడియాలో ఇతర జట్ల అభిమానుల ట్రోలింగ్ లు. ఇదీ మూడు వారాల కిందటి వరకు ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి.
కానీ మూడు వారాలు గడిచే సరికి.. పరిస్థితిలో అనూహ్య మార్పు. ఆడిన తర్వాతి ఆరు మ్యాచ్ లలో వరుసగా ఆరు విజయాలు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి ఎగబాకి ప్లే ఆఫ్స్ కు అర్హత. ఈ నేపథ్యంలో ఓటమిని సులువుగా అంగీకరించని విరాట్ కోహ్లీ తత్వాన్ని తెలియజేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ విషయంలోనైనా విజయం సాధించేందుకు ఒక్క శాతమే అవకాశం ఉన్నా ప్రయత్న లోపం లేకుండా నూరు శాతం కృషి చేస్తే ఆశించిన ఫలితం తప్పక లభిస్తుందని చెప్పుకొచ్చాడు.
ఆ వీడియోలో కోహ్లీ స్వీయ నమ్మకానికి ఉన్న శక్తిని వివరించాడు. ‘ఒక్కోసారి విజయం సాధించడానికి కేవలం ఒకే ఒక్క శాతం అవకాశం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఆ ఒక్క శాతమే సరిపోతుంది. కానీ మీరు ఆ ఒక్క శాతం గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. ఆ ఒక్క శాతం అవకాశాన్ని 10 శాతంగా అక్కడి నుంచి 30 శాతంగా మార్చుకొనేందుకు మీరు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నారా? మీరు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే అలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరగొచ్చు’ అంటూ కోహ్లీ యువతలో స్ఫూర్తినింపాడు.
‘ఒక శాతం నుంచి 100 శాతం దాకా’ కోహ్లీ చెప్పిన మాటలను నేనెప్పటికీ మరచిపోనంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. వీడియోను చూసిన నెటిజన్లంతా తనపై, జట్టుపై కోహ్లీకి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని కితాబునిస్తున్నారు.